సీఎం రేవంత్ రెడ్డి నియామకంతొ సంబరాలు చేసుకున్న కులకచర్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
కులకచర్ల కాంగ్రెస్ సంబరాలు
సీఎం రేవంత్ రెడ్డి నియామకంతొ సంబరాలు చేసుకున్న కులకచర్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
కులకచర్ల(టైమ్‌టుడే): వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని అధిష్టానం నిర్ణయించడంతో మండల వ్యాప్తంగా హర్షాదిరేఖాలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం కులకచర్ల మండల కేంద్రంలో డిసిసి ఉపాధ్యక్షుడు భీమ్ రెడ్డి వార్డు మెంబర్ మోత్కూరు వెంకటేష్ యువ నాయకుడు ఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషిచేసిన రేవంత్ రెడ్డిని సీఎంగా ఎన్నుకోవడం సమంజసం అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు శ్రీధర్ రెడ్డి మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య జిల్లా నాయకులు కుమ్మరి స్వామి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుప్పల వెంకటేష్ భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు కృష్ణయ్య గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి లింగం రాములు గోపాల్ శ్రీకాంత్ గాజు వెంకటేష్ వెంకట్రాముడు బాలకృష్ణ మహేందర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు
