| అనుమానాస్పద స్థితిలో బీఆర్ఎస్ నాయకుడి మృతి
| అనుమానాస్పద స్థితిలో బీఆర్ఎస్ నాయకుడి మృతి
» వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో ఘటన
(లమ్రాజు) (45) మృతదేహం అనుమానా ల్యాదెల్ల రాజు (ఫైల్)
గీసుగొండ, అక్టోబరు 19: వరంగల్ జిల్లాలో ఓ బీఆర్ఎస్ నాయకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గీసు గొండ మండలంలోని మొగిలిచర్ల గ్రామ సమీప అటవీ ప్రాంతంలో బీఆర్ఎస్ గొర్రె కుంట గ్రామశాఖ అధ్యక్షుడు ల్యాదెల్ల రాజు స్పద స్థితిలో పడి ఉంది. సమాచారం అందు కున్న కుటుంబసభ్యులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజు గొంతుభాగంలో కమిలిన గాట్లు కనిపించడం, మృతిపై అను మానాలు వ్యక్తమవడంతో పోలీసులు, క్లూస్ టీం, జాగిలాల సహా యంతో చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిం చారు. కొన్నేళ్ల క్రితం గుండెకు స్టెంట్ వేయించుకున్న రాజు గుండెపో టుతో మరణించారా లేదా మరే కారణమైనా ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్టం, పోస్ట్మార్టం రిపోర్టులు, రాజు ఫోన్ కాల్ డాటా ఆధారంగా దర్యాప్తు జరిపి మృతికి గల కారణాలను వెల్లడిస్తామని సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఘటనా స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు.
TIMETODAY-ADMIN
